News December 28, 2025

U-19 కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

image

చిన్న వయసులోనే తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. కేవలం 14ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా U-19తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. U-19 వరల్డ్ కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో BCCI వైభవ్‌కు బాధ్యతలు అప్పగించింది. జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.

Similar News

News December 30, 2025

ఇక నుంచి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఇక నుంచి ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా మారుస్తూ ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించనున్నాయని మంత్రులు పేర్కొన్నారు. జిల్లా GSWS కార్యాలయాల పేరు కూడా మారుస్తామని వెల్లడించారు.

News December 30, 2025

టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలి: టీటీడీ ఈవో

image

AP: వైకుంఠ ద్వారదర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మూడు రోజులు ఆన్‌లైన లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న నేరుగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి జనవరి 8 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

News December 30, 2025

అరటి పరిమాణం పెంచే ‘బంచ్‌ ఫీడింగ్‌’ మిశ్రమం

image

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్‌ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్‌ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.