News August 18, 2024

U-19 T20 ఉమెన్స్ WC షెడ్యూల్ వచ్చేసింది

image

మలేసియా వేదికగా 2025లో జరగనున్న అండర్-19 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 16 టీమ్‌లు 4 గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. జనవరి 18 నుంచి 24 గ్రూప్ దశ, 25 నుంచి 29 వరకు సూపర్ సిక్స్, 31న రెండు సెమీ ఫైనల్స్(FEB 1 రిజర్వ్ డే), 2న ఫైనల్ మ్యాచ్(3న రిజర్వ్ డే) జరగనుంది. గ్రూప్-Aలో ఇండియా, విండీస్, శ్రీలంక, మలేసియా ఉన్నాయి.

Similar News

News December 7, 2025

ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

image

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

News December 7, 2025

20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

image

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్​, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

News December 7, 2025

2,757 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BA, B.com, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు DEC18 వరకు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.