News September 8, 2024
‘ఎమర్జెన్సీ’కి U/A సర్టిఫికెట్.. కొన్ని సీన్లు కట్ చేయాలని ఆదేశం

బాలీవుడ్ నటి కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ చేసింది. సిక్కు వర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గతంలో బోర్డు సర్టిఫికెట్ జారీని నిలిపేసింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. తాజాగా U/A సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు కొన్ని సీన్లు డిలీట్ చేసి, డిస్క్లెయిమర్స్ యాడ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
Similar News
News December 7, 2025
నావల్ డాక్యార్డ్లో 320 పోస్టులు

విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ 320 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
News December 7, 2025
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
News December 7, 2025
శని దోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి?

చేసే పనులకు అడ్డంకులు ఎదురైనా, ప్రతి విషయం ఆలస్యమైనా, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయినా, మానసిక బాధ, నిరాశ వంటి లక్షణాలు శని దోషానికి సంకేతాలుగా భావించవచ్చు. అలాగే యవ్వనంలోనే జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం, వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, తరచూ గొడవలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శని దోషం ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి మీ జన్మ తేదీ, సమయం ఆధారంగా జ్యోతిషుడిని సంప్రదించాలి.


