News February 6, 2026

U19 WC ఫైనల్.. టాస్ గెలిచిన భారత్

image

హరారే వేదికగా ENGతో జరుగుతోన్న U19 ODI WC ఫైనల్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సేమ్ టీమ్‌తో ఆడుతున్నామని, ఈ బ్యాటింగ్ పిచ్‌లో మంచి టార్గెట్ సెట్ చేయాలనుకుంటున్నట్లు కెప్టెన్ ఆయుష్ మాత్రే తెలిపారు.

IND: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(C), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్

Similar News

News February 20, 2026

16 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే..

image

సంతోషీ మాత వ్రతాన్నే ‘16 శుక్రవారాల వ్రతం’ అంటారు. ఈ వ్రతం చేస్తే అద్భుత మార్పులుంటాయని నమ్మకం. ‘మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహం యోగం లేనివారికి మంచి ఫలితాలుంటాయి. దంపతుల మధ్య కలహాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇల్లు సుఖసంతోషాలతో, ధనదాన్యాలతో విరాజిల్లుతుంది’ అని పండితులు చెబుతున్నారు.

News February 20, 2026

పుచ్చ పంటలో పండు ఈగను ఎలా నివారించాలి?

image

పుచ్చ పంటలో పండు ఈగ తల్లి పురుగులు పూమొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలిచి లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. కాయలు వంకర్లు తిరిగి కుళ్లిపోతాయి. వీటి నివారణకు క్యూల్యూర్ అనే పండు ఈగ ఆకర్షణ బుట్టలు ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పంటకాలం మొత్తం అమర్చుకోవాలి. తీవ్రతను బట్టి లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News February 20, 2026

BECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం గలవారు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/అసెస్‌మెంట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.24,356 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PwBDలకు ఫీజులేదు. సైట్: www.becil.com