News January 19, 2025
U19 WC: నేడు ఇండియాVSవెస్టిండీస్

ICC ఉమెన్స్ U19 వరల్డ్ కప్లో ఇవాళ భారత్ వెస్టిండీస్తో తలపడనుంది. మ.12 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ TV ఛానల్స్లో చూడవచ్చు. IND కెప్టెన్గా నికి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్లో టాప్ రన్ స్కోరర్ గొంగడి త్రిష, టాప్ వికెట్ టేకర్ ఆయుషి శుక్లా జట్టులో ఉండటం భారత్కు బలం. కాగా నేడు జరిగే మరో మ్యాచులో SL, మలేషియా తలపడనున్నాయి.
Similar News
News January 2, 2026
నాభి రహస్యం – ఆరోగ్యానికి మూలం

విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించడం సృష్టికి మూలం నాభి అని సూచిస్తుంది. తల్లి గర్భంలో శిశువుకు నాభి ద్వారానే జీవం అందుతుంది. మన శరీరంలోని 72 వేల నరాలు నాభి వద్దే అనుసంధానమై ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం నాభికి నూనె రాస్తే జీర్ణక్రియతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేసి, సహజంగా రోగాలను నయం చేసే అద్భుతమైన ప్రక్రియ.
News January 2, 2026
వరి నారుమడికి రక్షణ కోసం ఇలా చేస్తున్నారు

వరి నారుమడిని పక్షులు, కొంగలు, పందుల నుంచి రక్షించడానికి కొందరు రైతులు వరి నారుమడికి నాలుగు వైపులా కర్రలు పాతి, తాడు కట్టారు. ఆ తాడుకు రంగు రంగుల ప్లాస్టిక్, తళతళ మెరిసే ఫుడ్ ప్యాకింగ్ కవర్స్, క్యాసెట్ రీల్స్, డెకరేషన్లో వాడే కలర్ కవర్స్ కడుతున్నారు. సూర్యరశ్మి వల్ల ఈ కవర్ల నుంచి వచ్చే కాంతి, గాలి వల్ల కవర్ల శబ్దంతో పక్షులు, పందులు అసౌకర్యంగా ఫీలై అవి నారు వైపు రావటం లేదని రైతులు అంటున్నారు.
News January 2, 2026
విజయవాడ పుస్తకాల పండుగ నేటి నుంచే

AP: 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇందుకోసం ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 280-300 స్టాళ్లలో వేల పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు.


