News January 31, 2025
U19 WC: నేడు సెమీస్ పోరు.. భారత్ ఫైనల్కు వెళ్తుందా?

ఐసీసీ U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఇవాళ సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. సెమీ ఫైనల్-1లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉ.8 గంటలకు ప్రారంభం అవుతుంది. సెమీ ఫైనల్-2లో ఇండియా, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ మ.12 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.
Similar News
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.
News December 4, 2025
రూపాయి మరింత పతనం

రూపాయి నేలచూపులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి రికార్డు కనిష్ఠ స్థాయిని తాకింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90.43కి పడిపోయింది. నిన్న 90.19 వద్ద ముగిసింది. భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్ విలువ పెరిగి రూపాయి కిందికి పడుతోంది. ఏడాదిలో 85 నుంచి 90కి పడిపోయిందని, ఇది అత్యంత వేగవంతమైన క్షీణత అని ఎస్బీఐ తెలిపింది.


