News January 18, 2025

నేటి నుంచి U19 మహిళల టీ20 WC

image

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్-ఏలో ఉన్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచును రేపు WIతో ఆడనుంది. నేడు తొలి మ్యాచు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో చూడవచ్చు. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 10, 2026

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘రాజాసాబ్’ HD ప్రింట్

image

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను TG హైకోర్టు కొట్టివేయగా తాజాగా ఈ చిత్ర HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కేటుగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ X వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరమంటూ మండిపడుతున్నారు.

News January 10, 2026

పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

image

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్‌తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్‌ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్‌తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.

News January 10, 2026

సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 19 వరకు మరిన్ని స్పెషల్ ట్రైన్‌లను నడపనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో HYD-సిర్పూర్ కాగజ్ నగర్(07473), ఈ నెల 10, 11 తేదీల్లో సిర్పూర్-HYD (07474), 11, 12, 12, 18, 19 తేదీల్లో HYD-విజయవాడ(07475), 10, 11, 12, 17, 19 తేదీల్లో విజయవాడ-HYD(07476) మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.