News June 22, 2024
రేప్ కేసుల్లో అబార్షన్కు యూఏఈ అనుమతి

రేప్ కేసుల్లో బాధితులైన మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించే కీలక తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదించింది. అక్రమ సంబంధం లాంటి కేసుల్లోనూ ఈ మినహాయింపు ఇవ్వనుంది. మహిళల ఆరోగ్యం దృష్ట్యా 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వారికి ప్రభుత్వమే వైద్య సదుపాయం అందించనుంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుంది.
Similar News
News December 5, 2025
వారంలో 100 టన్నులు అమ్మేశారు..

వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు దీనిని ‘క్యాష్’ చేసుకున్నారు. ఇంట్లో ఉండే వెండిని భారీగా అమ్మేశారు. కేవలం వారంలోనే సుమారు 100 టన్నుల పాత వెండి మార్కెట్కు వచ్చినట్లు IBJA అంచనా వేసింది. సాధారణంగా నెలకు 10-15 టన్నులు మార్కెట్కు వచ్చేది. KG వెండి ధర రూ.1.90,000కు చేరుకోవడంతో లాభాల కోసం కుటుంబాలు దుకాణాలకు క్యూ కట్టాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఖర్చులు కూడా అమ్మకాలకు ఓ కారణం.
News December 5, 2025
కష్టాలకు తలొగ్గవద్దు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది: కేసీఆర్

TG: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ సీఎం KCR సూచించారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు సభ్యులు ఆయనను కలిశారు. BRS అధినేత వారిని సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా KCR మాట్లాడుతూ ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అధైర్యపడకుండా ముందుకు నడవాలి’ అని చెప్పారు.
News December 5, 2025
రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్కు ఆహ్వానం

రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.


