News April 21, 2024
పేరులో ‘స్వస్తిక’ ఉన్నందుకు మహిళపై ఉబర్ నిషేధం!
ఆస్ట్రేలియాలో ఉబర్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. స్వస్తిక చంద్ర అనే మహిళ గత ఏడాది అక్టోబరులో ఉబర్ ఈట్స్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆమె పేరును హిట్లర్ నాజీ సంకేతంగా భావించిన ఉబర్ మహిళ ఖాతాను నిషేధించింది. బాధితురాలు సుమారు 5 నెలల పాటు సంస్థతో పోరాడింది. అటు ఆస్ట్రేలియా హిందూ మండలి కూడా జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఉబర్ దిగొచ్చింది. స్వస్తికకు సారీ చెప్పి మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చింది.
Similar News
News November 19, 2024
IND-CHINA: మానసరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్స్‌పై చర్చ
కరోనా, ఆ తర్వాత తూర్పు లద్దాక్‌లో ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య 2020 నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ విషయంలో పురోగతి కనిపిస్తోంది. జీ20 సమ్మిట్‌లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ <<14650227>>భేటీలో<<>> విమానాల పునరుద్ధరణపై చర్చ జరిగింది. అలాగే చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రారంభంపైనా సానుకూల డిస్కషన్ జరిగింది.
News November 19, 2024
ఆస్ట్రేలియా వ్యూహాలేంటో కోహ్లీకి తెలుసు: మంజ్రేకర్
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పలు వ్యూహాలతో టార్గెట్ చేస్తుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఆ వ్యూహాలన్నీ విరాట్‌కు తెలుసని పేర్కొన్నారు. ‘ఆఫ్‌స్టంప్ ఆవల వెళ్లే బంతిని ఆడి ఔటవ్వడం కోహ్లీకి ప్రధాన బలహీనత. దాన్నే కంగారూలు లక్ష్యంగా చేసుకుంటారు. న్యూజిలాండ్ బౌలర్లు సక్సెస్ అయిన తరహాలోనే ఆయన శరీరంపైకి కూడా దాడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
News November 19, 2024
రేపు YS జగన్ ప్రెస్ మీట్
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని పార్టీ అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేసిన ఆయన, మరోసారి మీడియాతో మాట్లాడనుండటంపై ఉత్కంఠ నెలకొంది. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.