News August 16, 2024

సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ క్లారిటీ

image

మ‌హారాష్ట్ర‌లో విప‌క్ష‌ మ‌హావికాస్ అఘాడీ కూట‌మి CM అభ్య‌ర్థిగా కాంగ్రెస్‌, శ‌ర‌ద్ ప‌వార్ NCPలు ఎవ‌ర్ని ప్ర‌క‌టించినా మ‌ద్దతు ఇస్తామని శివ‌సేన UBT చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే స్పష్టం చేశారు. ‘సీఎం అభ్య‌ర్థిపై గ‌తకొన్ని రోజులుగా ఊహాగానాలు న‌డుస్తున్నాయి. కూట‌మిలోని నేత‌ల‌కు నేను చెప్పేది ఒక్క‌టే. పృథ్విరాజ్ చవాన్, శ‌ర‌ద్ ప‌వార్‌లు ఎవ‌రి పేరును ప్ర‌క‌టించినా బేషర‌తుగా మ‌ద్దతు ఇస్తాను’ అని ఉద్ధ‌వ్‌ తెలిపారు.

Similar News

News July 6, 2025

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

image

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.

News July 6, 2025

ప్రభాస్‌తో రణ్‌వీర్ బాక్సాఫీస్ క్లాష్?

image

ప్రభాస్‌తో బాక్సాఫీస్ క్లాష్‌కి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.

News July 6, 2025

‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్న ఎలాన్ మస్క్

image

‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ పాసైతే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో పార్టీపై ట్విట్టర్‌లో రెండోసారి పోల్ పెట్టగా.. 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలోనే “రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.