News June 20, 2024

మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్

image

మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో PM మోదీకి తనకు మధ్య పోరు నెలకొందని ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఏక్‌నాథ్ షిండేను పక్కన పెట్టి ఎన్నికలకు సన్నద్ధం కావాలని సవాల్ చేశారు. శివసేన నిజమైన సింబల్(బాణం)ను వాడకుండా BJP ఎన్నికలు గెలవాలని పార్టీ అవిర్భావ వేడుకల్లో అన్నారు. మరోవైపు NDAలో చేరుతారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తమను అంతం చేయాలనుకున్న పార్టీతో చేరేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News November 21, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.

News November 21, 2025

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

image

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్‌ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.

News November 21, 2025

7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

image

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్‌డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.