News March 1, 2025

దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

image

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.

Similar News

News March 1, 2025

ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

image

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్‌ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.

News March 1, 2025

డ్రగ్స్‌పై పంజాబ్ యుద్ధం

image

మాదకద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే 12వేల మందికి పైగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 750 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 8 కిలోల హెరాయిన్, 16వేలకు పైగా మత్తు ట్యాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 290 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News March 1, 2025

తీవ్ర విషాదం.. ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని

image

TG: చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్(D)లో జరిగింది. నర్సాపూర్‌‌కు చెందిన వైష్ణవి HYDలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె ఇవాళ ఇంట్లోనే ఉరివేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పాలని పేరెంట్స్, టీచర్లకు నిపుణులు సూచిస్తున్నారు.

error: Content is protected !!