News September 9, 2025
UG పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.8,00 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు.
Similar News
News April 14, 2026
KNR: ‘ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి’

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 14, 2026
అమరావతిలో మరో 3,072 ఎకరాల భూసమీకరణ

AP: రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు(M) పెదపరిమి పరిధిలో ప్రభుత్వ భూమిని మినహాయించి 3,072 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు CRDA నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై నెల రోజుల్లో రైతులు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ భూమిని వినియోగించనున్నారు.
News April 14, 2026
GNT: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు డీజీపీ కార్యాలయం శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్లిరోజు నాడు కచ్చితంగా సెలవు మంజూరు చేయనున్నారు. సిబ్బంది తమ కుటుంబాలతో ఈ వేడుకలు జరుపుకునేలా ఈ అవకాశం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా సిబ్బందికి కచ్చితంగా సెలవులు ఇవ్వాలని యూనిట్ అధికారులకు డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు.


