News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

AP: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉత్సవ మూర్తులకు రాత్రి 7గం. గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి.
Similar News
News November 1, 2025
ఇండస్ నీరు ఏమాత్రం ఆగినా పాక్లో వినాశనమే: IEP

పాకిస్థాన్లో 80% వ్యవసాయం ‘ఇండస్’ నీటిపైనే ఆధారపడింది. ఈ బేసిన్ అత్యధిక భాగం ఉన్న ఇండియా కనుక నీటి ప్రవాహాన్ని ఏమాత్రం ఆపినా పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ పేర్కొంది. పాక్లోని సింధునది ఆనకట్టల్లో 30రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదని పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలంపాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.
News November 1, 2025
పోక్సో కేసులో దోషికి శిక్ష రద్దు

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తిపై శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కృపాకరన్(TN) అనే వ్యక్తి 2017లో బాలికపై లైంగికదాడి చేశాడు. అతడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను మద్రాస్ HC సమర్థించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన అతడు తాము పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అది ప్రేమతో జరిగిన నేరమే తప్ప కామంతో కాదని వ్యాఖ్యానిస్తూ సుప్రీం అతడి శిక్షను రద్దు చేసింది.
News November 1, 2025
తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: దేవాదాయ శాఖ

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటనపై దేవాదాయ శాఖ స్పందించింది. అది పూర్తిగా ప్రైవేటు గుడి అని, ప్రభుత్వ అధీనంలో లేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ప్రభుత్వానికి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు.


