News March 30, 2025
ఉగాది కానుక.. CMRF దస్త్రంపై చంద్రబాబు సంతకం

AP: పేదలకు సాయంపై ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయనిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు.
Similar News
News April 1, 2025
రోహిత్ కాబట్టే ఇంకా జట్టులో ఉన్నారు: వాన్

హిట్మ్యాన్ రోహిత్ IPLలో విఫలమవ్వడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ విమర్శలు చేశారు. ప్రస్తుతం అతను కెప్టెన్ కాదని, కేవలం బ్యాట్స్మెన్ మాత్రమేనని పేర్కొన్నారు. రోహిత్ కాకుండా మరొకరు ఇలా తక్కువగా రన్స్ చేస్తే టీమ్ నుంచి బయటకు పంపేవారని చెప్పారు. అలాగని తాను రోహిత్ను టీం నుంచి డ్రాప్ కావాలని కోరుకోవట్లేదన్నారు. అయితే తిరిగి హిట్మ్యాన్ త్వరగా ఫామ్ అందుకొని జట్టుకు విజయాలు అందించాలని కోరారు.
News April 1, 2025
CBSE సిలబస్లో కీలక మార్పులు

సీబీఎస్ఈ 10 నుంచి 12 తరగతుల సిలబస్లో కీలక మార్పులు చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్ నుంచి అన్ని అనుబంధ స్కూల్స్లో అప్డేటెడ్ సిలబస్ అందుబాటులోకి రానుంది. విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు తగినట్లు సిద్ధం చేయడం, మరింత క్రియాశీల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మార్పులు చేసినట్లు బోర్డు పేర్కొంది. వినూత్న పద్ధతిలో బోధించాలని, గైడ్లైన్స్ పకడ్బందీగా అమలు చేయాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
News April 1, 2025
SBI వినియోగదారులకు అలర్ట్

కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుండటంతో SBI కీలక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటలకు వరకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. చెల్లింపుల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE, ATMను వినియోగించాలని సూచించింది. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.