News April 1, 2024
శ్రీశైలంలో 6 నుంచి ఉగాది మహోత్సవాలు

AP: శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఏటా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పార్కింగ్, శౌచాలయం, మంచినీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News February 16, 2026
జేఈఈ మెయిన్ ఫైనల్ కీ రిలీజ్

జేఈఈ మెయిన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో NTA ఫైనల్ కీ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఇవాళ వెల్లడిస్తామని 4రోజుల కిందట అప్డేట్ ఇచ్చింది. తాజాగా కీ విడుదల కాగా ఏ క్షణంలోనైనా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది.
News February 16, 2026
అభిషేక్ ఫ్లాప్ షో.. 6 మ్యాచుల్లో 4 డకౌట్స్

T20Iల్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్లాప్ షో నడుస్తోంది. T20WCలో ఆడిన 2 మ్యాచుల్లోనూ సున్నాకే వెనుదిరిగారు. అటు చివరి 6 మ్యాచుల్లో 4 సార్లు డకౌట్(0, 68*, 0, 30, 0, 0,) అయ్యారు. అభిషేక్ టాలెంట్‌పై సందేహం లేకపోయినా T20WCలాంటి పెద్ద వేదికల్లో ఇలా నిలకడ చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. అటు ఈ ఫార్మాట్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా రోహిత్ 10సార్లు, ఆ తర్వాత అభిషేక్&రాహుల్ 5సార్లు డకౌట్ అయ్యారు.
News February 16, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వకు రెండు చెంచాల నూనె కలపండి. * క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది. * వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది. క్యాబేజీ కూర వండేప్పుడు అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. * మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే కేకు మరింత రుచిగా వస్తుంది.


