News April 5, 2024
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 8.45 గంటలకు యాగశాల ప్రవేశం చేసి పూజలు ప్రారంభించనున్నారు. మహోత్సవాల సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనం రద్దు చేశారు. కాగా ఇప్పటికే లక్షలాది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. దీంతో ఆలయం, సత్రాలు, హోటళ్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
Similar News
News November 21, 2025
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: TTD

AP: శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు NOV 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు Global Hindu Heritage, savetemples.org సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అవి మోసపూరితంగా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 21, 2025
పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణే కాక Herd Immunityని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
News November 21, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. OCT 11న సీజ్ఫైర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి Israel దాడుల్లో కనీసం 211 మంది చనిపోయారని, 597 మంది గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల ఎలాంటి మార్పూ రాలేదని, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పాలస్తీనియన్లు ఆవేదన చెందుతున్నారు.


