News January 29, 2026
UGC రూల్స్‌పై సుప్రీం స్టే

UGC ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు 2012 రూల్స్ అమలులో ఉంటాయని తెలిపింది. యూజీసీ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన CJI విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.
Similar News
News February 21, 2026
లొంగు‘బాట’లో దేవ్‌జీ?

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్‌జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్‌గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్‌జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.
News February 21, 2026
ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/
News February 21, 2026
చర్మానికి బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.


