News December 29, 2024
UGC నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

UGC-నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని పొందవచ్చు. 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్కోడ్, క్యూఆర్ కోడ్ను అభ్యర్థులు చెక్ చేసుకోవాలని, సరిగ్గా లేకుంటే మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <
Similar News
News December 15, 2025
ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాల వలస

AP: రాష్ట్రంలో ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు సచివాలయాల సర్వేలో వెల్లడైంది. వారంతా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పనులు చేసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలుండగా అత్యధికంగా విశాఖ(D)లో 1.13 లక్షలు, నెల్లూరులో 85వేల ఫ్యామిలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
News December 15, 2025
పీరియడ్స్ నొప్పికి కారణాలు

పీరియడ్స్ నొప్పికి హై-లెవెల్ ప్రోస్టాగ్లాండిన్స్, యుటెరస్ వంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరగడం, గర్భాశయంలో నాన్-క్యాన్సర్ ఫైబ్రాయిడ్ల పెరుగుదల, అడెనోమైయోసిస్, అంటే యుటెరస్ లైనింగ్ కండరాల గోడపై దాడి చేసి నొప్పికి దారితీస్తుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్లు పీరియడ్స్ నొప్పిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 15, 2025
వరుసగా 42 రోజులు ఇలా చేస్తే..

వరుసగా 42 రోజుల పాటు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. జీవితంలో కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయని అంటున్నారు. అయితే ఎవరికీ చెప్పకుండా గోప్యంగా శివ పూజ చేయడం వల్ల ఏకాగ్రత, నిస్వార్థ భక్తి పెరుగుతాయనిసూచిస్తున్నారు. ‘శివాలయ ప్రాంగణంలో రోజూ కొద్దిసేపు గడపాలి. శివనామస్మరణతో సానుకూల శక్తిని గ్రహించాలి. ఫలితంగా ప్రతికూల శక్తులు, దోషాలు తొలగిపోతాయి’ అంటున్నారు.


