News January 13, 2025
యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.
Similar News
News January 14, 2025
పవన్ ‘OG’ సినిమా ఏ OTTలోకి వస్తుందంటే?
పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది. దీనితో పాటు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, మ్యాడ్ స్క్వేర్, సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ ఓటీటీ రైట్స్ను కూడా సొంతం చేసుకున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.
News January 14, 2025
TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలివే
☛ వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు
☛ ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి, 2023-24లో కనీసం 20 రోజులు పనులు చేసిన వారు అర్హులు.
☛ ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాన్ని యూనిట్గా గుర్తిస్తారు. లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికీ భూమి ఉండకూడదు. ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు.
☛ ₹6వేల చొప్పున రెండు విడతల్లో ₹12,000 ఖాతాల్లో జమ
☛ ఈనెల 26న తొలి విడత అమలు
News January 14, 2025
పండగ వేళ 19% పెరిగిన అదానీ షేర్లు.. ఎందుకంటే!
అదానీ షేర్లలో నేడు సంక్రాంతి కళ కనిపిస్తోంది. గ్రూప్ షేర్లు నేడు గరిష్ఠంగా 19% వరకు ఎగిశాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే లంచం కేసులో గౌతమ్ అదానీ, సంబంధీకులకు క్లీన్చిట్ ఇస్తారన్న వార్తలే ఇందుకు కారణం. ప్రస్తుతం అదానీ పవర్ 19, గ్రీన్ ఎనర్జీ 13, ఎనర్జీ సొల్యూషన్స్ 12, టోటల్ గ్యాస్ 9, NDTV 8, అదానీ ఎంటర్ప్రైజెస్ 8, APSEZ 5, ACC, అంబుజా సిమెంట్స్ 4%, సంఘి ఇండస్ట్రీస్ 3.2% మేర ఎగిశాయి.