News December 1, 2024
UK ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే?

UK ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ లూయిస్ హై అనుకోకుండా చేసిన ఓ తప్పిదం తన పదవికి రాజీనామా చేసేలా చేసింది. 11ఏళ్ల క్రితం ఆమె వస్తువులు దొంగతనానికి గురవగా పోలీస్ కంప్లైంట్‌లో మొబైల్ కూడా చేర్చారు. కానీ మొబైల్ ఇంట్లోని కబోర్డులో కనిపించినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత లొకేషన్ ట్రాక్ చేసి ఆమెను పోలీసులు విచారించారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు.
Similar News
News February 4, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన BJP అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నట్లు జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.
News February 4, 2026
నామినేషన్ల పర్వం సమాప్తం.. నేటి నుంచి హోరెత్తనున్న ప్రచారం!

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, అభ్యర్థులపై స్పష్టత రావడంతో నేటి నుంచి ప్రచారం హోరెత్తనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. FEB 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
News February 4, 2026
ట్రేడ్ డీల్ ఖరారు.. అమెరికాలో జైశంకర్ బిజీ

IND-US ట్రేడ్ డీల్ ఖరారవడంతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు. వాషింగ్టన్‌లో US సెక్రటరీ రూబియో, ట్రెజరీ సెక్రటరీ బెసెంట్‌లతో భేటీ అయ్యారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్‌తో సహకారంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇంధన భద్రత, కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.


