News August 19, 2025

USతో ఉక్రెయిన్ భారీ వెపన్ డీల్‌!

image

USకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ $100 బిలియన్ల వెపన్ డీల్‌ ఆఫర్ చేసినట్లు Financial Times వెల్లడించింది. ట్రంప్‌తో భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యూరప్ ఫండ్స్‌తో US నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. బదులుగా రష్యాతో వార్ తర్వాత తమకు భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో ట్రంప్‌కు కావాల్సింది ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News August 19, 2025

చించినాడ బ్రిడ్జిపై ఆగస్టు 21 వరకు ఆంక్షలు: కలెక్టర్

image

చించినాడ వంతెన మరమ్మతుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఆగస్టు 21 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సాయంత్రం 7 గంటల వరకు ఉన్న ట్రాఫిక్ బ్లాక్ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించామన్నారు. ప్రజలు ఈ ఆంక్షలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

News August 19, 2025

చైనాలో తైవాన్‌ భాగమేనని భారత్ చెప్పిందా?

image

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ‌తో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.

News August 19, 2025

పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

image

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ <<17450773>>మృతిపై<<>> ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పద్మజ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని తెలిపారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన అత్త ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.