News August 21, 2024

ఉక్రెయిన్ టూర్: మోదీ వెళ్లే రైలిదే

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 23న పోలాండ్ నుంచి <<13902900>>ఉక్రెయిన్‌కు<<>> ‘రైల్ ఫోర్స్ వన్’లో ప్రయాణించనున్నారు. ఈ విలాసవంతమైన రైలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అత్యున్నత స్థాయి ప్రయాణాన్ని అందిస్తుంది. అత్యంత భద్రతతో కూడిన ఈ రైలులో పెద్ద టేబుల్స్, సోఫా, టీవీ, విశ్రాంతి కోసం పడక గది ఉంది. మొత్తం 20 గంటల ప్రయాణంలో యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాల గుండా 10 గంటలు ప్రయాణించి కీవ్ నగరానికి చేరుకుంటారు.

Similar News

News December 3, 2025

KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్‌ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.

News December 3, 2025

‘ది రాజా సాబ్’ రన్ టైమ్ 3గంటలు ఉండనుందా?

image

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్‌పై SMలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్ బుకింగ్ యాప్స్‌లో రన్ టైమ్ 3.15 గంటలు ఉన్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. భారత్‌లోనూ దాదాపుగా ఇదే రన్ టైమ్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.