News April 8, 2024
US సాయం చేయకపోతే ఉక్రెయిన్ ఓడిపోతుంది: జెలెన్‌స్కీ
రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అమెరికా సాయం చేయకపోతే రష్యా చేతిలో ఓటమి తప్పదన్నారు. అమెరికా కాంగ్రెస్ తమకు మిలిటరీ సాయాన్ని ఆమోదించాలని కోరారు. సాయం లేకపోతే తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ ఓడితే.. ఇతర రాష్ట్రాలపైనా దాడులు జరుగుతాయన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దాడి రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
Similar News
News January 9, 2025
ఇండియా కూటమిని మూసేయండి: ఒమర్ అబ్దుల్లా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభేదాలను మరింత పెంచాయి. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా JK CM ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్వరంతో మాట్లాడారు. లోక్‌సభ వరకే పరిమితం అనుకుంటే ఇండియా కూటమిని మూసేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యూహాలేమీ లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. INDIA కేవలం లోక్‌సభ వరకే పరిమితమన్న RJD నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలపై ఇలా స్పందించారు.
News January 9, 2025
తిరుపతి బయల్దేరిన సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి తిరుపతికి బయల్దేరారు. నిన్న తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. కాగా, ఘటనకు సంబంధించి నివేదిక ఇప్పటికే ఆయన వద్దకు చేరింది. ఘటన అనంతర పరిణామాలపై అధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన తిరుపతి బయల్దేరారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
News January 9, 2025
రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార ప్రొటోకాల్ దర్శనాలు రేపు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్నాయి.