News May 1, 2024
రష్యా దాడిలో ఉక్రెయిన్ ‘హ్యారీపోటర్’ కోట ధ్వంసం

‘హ్యారీపోటర్’ సినిమాలోని కోటను పోలిన కోట ఉక్రెయిన్‌లో ఉంది. ఆ సినిమా పేరిటే దాన్ని పిలుస్తున్నారు. తాజాగా రష్యా చేసిన దాడిలో ఆ కోట ధ్వంసమైంది. నలుగురు మృతిచెందగా 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20 వరకు భవనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ దాడిలో ఇస్కందర్ బాలిస్టిక్ క్షిపణిని రష్యా వాడి ఉండొచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
Similar News
News March 16, 2026
నక్సలైట్ రోల్‌లో పీపుల్స్ స్టార్

స్వీయ దర్శకనిర్మాణంలోనే సినిమాలు చేస్తున్న పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి చాలా ఏళ్ల తర్వాత ఓ బయటి చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న హుషారు-2లో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. తన ఐడియాలజీకి దగ్గరగా ఉండటంతోనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టెంపర్ సహా అనేక చిత్రాల కోసం డైరెక్టర్లు సంప్రదించినా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇకపై ఆయన ఇతరుల సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.
News March 16, 2026
గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ & డెలివరీ సమయంలో ఆటంకాలు రావొద్దంటే వెంటనే eKYC పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇది తప్పనిసరని పేర్కొంది. దీనికోసం1800 233 3555 నంబర్‌కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసి ‘Aadhaar FaceRD’ యాప్ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. SHARE IT
News March 16, 2026
నేడే రాజ్యసభ ఎన్నికలు.. బరిలో నితీశ్ కుమార్

రాజ్యసభలో 37 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. TG(2 స్థానాలు)తో పాటు బెంగాల్, అస్సాం, బిహార్, TN, MH, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హరియాణా, HPలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 26 స్థానాలు ఏకగ్రీవం కానుండగా 11 సీట్ల కోసం పోలింగ్ నిర్వహిస్తారు. బిహార్ CM నితీశ్ కుమార్, BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. MPగా ఎన్నికయ్యాక CM పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశముంది.


