News September 21, 2024
అమ్మో.. ఈ కార్లకు అంత ధరా..?

ఈ ఏడాది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో తొలి 2స్థానాలను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. అగ్రస్థానంలో రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్టెయిల్(ధర రూ.251 కోట్లకు పైమాటే), రెండో ప్లేస్లో బోట్ టెయిల్(రూ.234 కోట్లు), రూ.156 కోట్లతో బుగాటీ లా వోయిచర్ నోయిర్ 3వ స్థానంలో నిలిచాయి. పగానీ జోండా హెచ్పీ బార్చెటా(రూ.142 కోట్లు), ఎస్పీ ఆటోమోటివ్ చౌస్(రూ.120 కోట్లు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News January 24, 2026
బడ్జెట్ 2026: పాత పన్ను విధానానికి కాలం చెల్లినట్లేనా?

బడ్జెట్ 2026లో పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే 72% మంది ట్యాక్స్ పేయర్స్ కొత్త విధానానికే మొగ్గు చూపుతున్నారు. పాత దాంట్లో పెట్టుబడుల లెక్కలు చూపడం, తనిఖీలు, నోటీసులు ఎదుర్కోవడం కష్టమవుతుండటంతో.. ప్రభుత్వం దీన్ని రద్దు చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కాకుండా కొంత గడువు ఇచ్చి తీసేయొచ్చని భావిస్తున్నారు.
News January 24, 2026
ట్రంప్ చేతికి గాయం.. అసలేమైంది?

చేతికి గాయంతో ట్రంప్ కనిపించడం చర్చనీయాంశమవుతోంది. 2 రోజుల కిందట దావోస్లో గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. అప్పుడు ఆయన చేతిపై గాయం కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. టేబుల్ తగలడంతో గాయమైంది. దానికి క్రీమ్ రాశా. <<18737292>>గుండె ఆరోగ్యం<<>> బాగుండాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. గాయాలు కావద్దనుకుంటే ఆస్పిరిన్ తీసుకోవద్దు’ అని ట్రంప్ అన్నారు.
News January 24, 2026
రామ్చరణ్ ‘పెద్ది’ వాయిదా?

రామ్చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్తో కలిపితే ఇంకా ఆలస్యం అవుతుందంటున్నాయి. దీంతో మేకర్స్ ముందుగా ప్రకటించిన మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదని చర్చించుకుంటున్నాయి. మే లేదా జూన్ నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.


