News August 25, 2024
శాంతికి పిలుపునిచ్చిన UN, లెబనాన్

భీకర దాడికి దిగిన హెజ్బొల్లా-ఇజ్రాయెల్‌ను శాంతిపజేయడానికి UN, లెబనాన్ రంగంలోకి దిగాయి. దాడులు ఆపాలని, పరిస్థితులను మరింత దిగజార్చే చర్యలను నిలిపివేయాలని ఇరు వర్గాలకు లెబనాన్ ప్రధాని, అక్కడి UN ప్రతినిధులు కోరారు. దాడులను విరమించి, 2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఆమోదించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి-1701 తీర్మానం అమలు ఉత్తమ మార్గమని పేర్కొన్నాయి.
Similar News
News October 16, 2025
RNSBలో ఉద్యోగాలు

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్సైట్: https://rnsbindia.com/
News October 16, 2025
బిగ్‌బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్‌బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
News October 16, 2025
ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్‌ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.