News April 5, 2024

UN నాకు చెప్పాల్సిన అవసరం లేదు: జైశంకర్

image

గతవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్య సమితి(UN) స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దానిపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారత ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.

Similar News

News December 14, 2025

మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: వివేక్

image

TG: రాబోయే మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. వికారాబాద్‌లోని నస్కల్‌లో ATC శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతకు సరైన ఉద్యోగాలు రావాలంటే స్కిల్ తప్పనిసరని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. త్వరలోనే తమ ప్రభుత్వం మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.

News December 14, 2025

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News December 14, 2025

ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని ఆలయాలకు వెళ్లవచ్చా?

image

శాస్త్రాల ప్రకారం.. స్త్రీలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. ఈ చర్యను అపవిత్రంగా భావిస్తారు. అలాగే ఇది భగవంతుడికి అపచారం చేసినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని దోషాలు కూడా కలుగుతాయని అంటున్నారు. పూజలు, ఆలయాల్లో పవిత్రత, శుచి, శుభ్రతలను పాటించాలని, గుళ్లకు వెళ్లే స్త్రీలు జుట్టును శుభ్రంగా ముడివేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే దైవ కృప లభిస్తుందంటున్నారు.