News May 14, 2024

గాజాలో యూఎన్ భారత సిబ్బంది మృతి!

image

ఇజ్రాయెల్ దాడిలో ఐక్యరాజ్యసమితి రక్షణ, భద్రతా విభాగంలో పనిచేస్తున్న భారత సిబ్బంది మరణించారు. గాజాలోని రఫాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరగడంతో మరణించినట్లు పీటీఐ పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్ అంతర్జాతీయ సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి. రఫాలో తలదాచుకున్న పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 27, 2026

ఈ తగ్గింపు ఎన్నికల వరకేనా: రాజ్‌దీప్

image

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల(మే 4) వరకేనా లేక కొనసాగుతుందా? అని జర్నలిస్ట్ రాజ్‌దీప్ ప్రశ్నించారు. గతంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు చేకూర్చలేదని విమర్శించారు. ఇంధన ధరలు మార్కెట్ పరిస్థితుల కంటే ఎన్నికలపై ఆధారపడ్డాయని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

News March 27, 2026

RCBvsSRH.. ప్లేయింగ్-11 అంచనా ఇదే!

image

క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. రేపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో RCB, SRH తలపడనున్నాయి. ఇరు జట్ల ప్లేయింగ్-11 అంచనా ఇలా ఉంది.
RCB: కోహ్లీ, సాల్ట్, వెంకటేశ్, రజత్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, జాకోబ్, మంగేశ్
SRH: అభిషేక్, హెడ్, కిషన్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్, అనికేత్, బ్రైడన్, హర్షల్, శివ్‌నాగ్, జీషన్

News March 27, 2026

KBCలో రూ.50 లక్షలు గెలిచి.. అవినీతి కేసులో జైలుపాలు

image

అమితాబ్ నిర్వహించే KBC షోలో రూ.50 లక్షలు గెలిచిన మహిళా తహశీల్దార్‌ అమితా సింగ్ తోమర్ వివాదంలో చిక్కుకున్నారు. రూ.2.5 కోట్ల వరద సహాయ నిధి స్కామ్‌లో ఆమె పాత్ర ఉందంటూ గ్వాలియర్(MP) పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం జైలుకు తరలించారు. దీంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ కేసులో తోమర్ ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించాయి.