News September 18, 2024
ఒత్తిడి భరించలేక యువ సీఏ ఆత్మహత్య

పని ఒత్తిడి భరించలేక యువ ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకుంది. పుణే (MH)కు చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది మార్చిలో ‘Ernst and Young’ కంపెనీలో జాయిన్ అయింది. ఎక్కువ పని గంటలతో కుంగిపోయిందని, తినేందుకు, నిద్రపోయేందుకూ సరైన సమయం లేక జులై 20న ఆత్మహత్య చేసుకుందని ఆ యువతి తల్లి పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియలకు ఆ కంపెనీ నుంచి ఒక్కరూ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 4, 2025
‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.
News December 4, 2025
జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.


