News August 31, 2024
UNBELIEVABLE: ఒక్క రన్ ఇవ్వకుండా 4 ఓవర్లు

T20ల్లో మరో రికార్డు నమోదైంది. హాంకాంగ్‌కు చెందిన ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 4 ఓవర్లు వేశారు. మంగోలియాతో T20లో ఉత్తమ గణాంకాలు(4-4-0-1) నమోదు చేశారు. తద్వారా ఒకే మ్యాచ్‌లో 4 మెయిడిన్లు వేసిన 3వ బౌలర్‌గా నిలిచారు. 2024 T20WCలో NZ పేసర్ ఫెర్గూసన్ PNGపై ఈ ఫీట్ సాధించారు. అంతకుముందు 2021లో కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ T20WC US రీజియన్ క్వాలిఫైయర్‌లో పనామాపై 4 మెయిడిన్ ఓవర్లు వేశారు.
Similar News
News February 19, 2026
అజహరుద్దీన్ పదవికి గండం… AICCలో చర్చ

TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి అయ్యాక 6 నెలల్లో శాసనసభ/మండలిలో సభ్యుడు కాకపోతే పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓ MLCతో రిజైన్ చేయించి ఆ స్థానంలో అజహర్‌ను ఎంపిక చేయాలని TPCC నేతలతో ఢిల్లీలో భేటీలో హైకమాండ్ సూచించింది. త్యాగం చేసే నేతకు ఇచ్చే పదవిపై నిర్ణయం జరగాల్సి ఉంది.
News February 19, 2026
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ఇలా.. ఫీజు చెల్లింపు: ఫిబ్రవరి 23- మార్చి 31, ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ: ఫిబ్రవరి 24 నుంచి మొదలు. ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 12, మెరిట్, సెలక్షన్ లిస్టు: ఏప్రిల్ 27, సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఏప్రిల్ 30. తరగతులు జూన్ నుంచి ప్రారంభమవుతాయని డైరెక్టర్ విజయరామ రాజు తెలిపారు.
News February 19, 2026
కిడ్నీలను కాపాడుకోండి.. వైద్యుల సూచనలివే!

మానవ శరీరంలో కిడ్నీలు పోరాట వీరులని, వీటిని కాపాడుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, బీపీ & షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘పెయిన్ కిల్లర్స్, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కిడ్నీలు పాడవుతాయి. డైలీ వ్యాయామం చేస్తూ, సమతుల్య ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి. మూత్రం రంగులో మార్పులొస్తే పరీక్షలు చేయించుకోవాలి’ అని తెలిపారు.


