News June 22, 2024
నిరుద్యోగి ఆత్మహత్య.. నాలుగేళ్లకు జాబ్ కాల్‌లెటర్

TG: మంచిర్యాల(D) మందమర్రికి చెందిన జీవన్‌కుమార్(24) 2018లో జూనియర్ లైన్మెన్ పరీక్ష రాశారు. తర్వాత మిగులు పోస్టుల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా మెరిట్ ఆధారంగా భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈక్రమంలో విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈనెల 24న రావాలంటూ జీవన్‌కు కాల్‌లెటర్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం రాకపోవడంతో అతడు 2020లోనే ఆత్మహత్య చేసుకున్నారు.
Similar News
News November 28, 2025
విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.
News November 28, 2025
త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. SHARE IT


