News July 5, 2024
దేశంలో 8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగం

భారత్‌లో నిరుద్యోగం 8 నెలల గరిష్ఠానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది జూన్ చివరి నాటికి 8.5శాతంగా, ఈ ఏడాది మేలో 7శాతంగా ఉన్న నిరుద్యోగిత ప్రస్తుతం 9.2శాతానికి చేరిందని వెల్లడించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. ఇక మహిళా నిరుద్యోగ శాతం జాతీయ నిరుద్యోగ రేటుకు దాదాపు రెట్టింపు పెరిగిందని స్పష్టం చేసింది.
Similar News
News March 28, 2026
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం
News March 28, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 28, 2026
బర్గర్ కంపెనీ బంపర్ గిఫ్ట్: ఉద్యోగులకు ₹15 కోట్ల బోనస్!

USకు చెందిన ప్రముఖ బర్గర్ చైన్ ‘ఫైవ్ గాయ్స్’ తన ఉద్యోగులకు సుమారు ₹15 కోట్ల బోనస్ ప్రకటించింది. సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా Feb 17న ఇచ్చిన ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్ల రద్దీ వల్ల స్టాక్ అయిపోవడం, ఆన్‌లైన్ సిస్టమ్స్ నిలిచిపోవడం వంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి. అయినా కమిటెడ్‌గా వర్క్ చేసిన 1,500 మంది ఉద్యోగులకు CEO జెర్రీ ముర్రెల్ ఈ నగదు బహుమతి అందించారు.


