News July 22, 2024
3.2%కి తగ్గిన నిరుద్యోగిత రేటు: నిర్మలా సీతారామన్

దేశంలో నిరుద్యోగిత రేటు 2022-23 నాటికి 3.2%కి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023-24 ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. 2024-25FYలో దేశ GDP 6.5%-7% వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆటో మొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల ₹67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, ₹14,000కోట్లు కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
క్లాస్రూమ్ టు అసెంబ్లీ.. యువ ‘ఎమ్మెల్యే’ టీమ్ ఇదే!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఈనెల 26న నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి అనంతపురం జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో విద్యార్థి ఎంపికయ్యారు. ఎమ్మెల్యేలా వారు అసెంబ్లీలో పాల్గొంటారు.
★ ఎంపికైన వారి వివరాలు ఇలా.. అనంతపురం-సదాఫ్ నాజ్, రాప్తాడు- శ్రీనిత్ రెడ్డి, రాయదుర్గం-గంగోత్రి, ఉరవకొండ-లోకేశ్, గుంతకల్లు-స్వప్న, తాడిపత్రి-అనిల్ కుమార్, శింగనమల-శిరీష, కళ్యాణదుర్గం- తలారి అభిజ్ఞ.
News November 21, 2025
బిజినెస్ కార్నర్

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.
News November 21, 2025
ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


