News March 17, 2025

ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

image

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.

Similar News

News March 17, 2025

అనారోగ్యంతో సీనియర్ నటి కన్నుమూత

image

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూశారు. చెన్నైలో నిన్న తుదిశ్వాస విడువగా ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. 1982లో తమిళ సినిమా ‘కోళీ కూవుతు’తో కెరీర్ మొదలెట్టి తెలుగులో ‘దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, ప్రాణానికి ప్రాణం’ తదితర సినిమాల్లో నటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన ఆమె అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూవచ్చారు. <<15773373>>ఆమె<<>> భారీగా బరువు తగ్గడంపైనా గతవారం కథనాలు వచ్చాయి.

News March 17, 2025

సిRAW: నా బూతే నా భవిష్యత్తు

image

ఒకప్పుడు హాస్యం వినసొంపుగా మనసుకి ఆహ్లాదం కలిగించేది. క్రమంగా ద్వంద్వ అర్థాలతో నవ్వించడం మొదలుపెట్టి ఇప్పుడు బూతే నవ్విస్తోంది, నడిపిస్తోంది. కొన్ని టీవీ షోలు, సినిమాలు వెగటు కామెడీతో వెళ్లదీస్తుంటే రాజకీయ నేతల నోటా ఈ రోతలే వినిపిస్తున్నాయి. ‘న భూతో న భవిష్యతి’ కాస్తా ‘నా బూతే నా భవిష్యత్తు’ అనేలా మారింది. పిల్లల్ని ఈ వికృత సంస్కృతికి దూరంగా పెంచకపోతే రేపు బూతే సుభాషితం కావొచ్చు.

News March 17, 2025

BC రిజర్వేషన్ల పెంపు కోసం PM మోదీని కలుద్దాం: CM రేవంత్

image

TG: BC రిజర్వేషన్ల పెంపు సాధనకై PM మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలని అసెంబ్లీలో CM రేవంత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించేలా పోరాడాలన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన BRS, BJP, MIMతో సహా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

error: Content is protected !!