News May 13, 2024

ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: CBN

image

AP: ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని TDP అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఒక్కరిలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే YCP వాళ్లు కుట్రలు పన్నుతూ వచ్చారని, అయితే.. ప్రజాస్వామ్యస్ఫూర్తితో వారి కుట్రలను TDP శ్రేణులు భగ్నం చేశాయని అన్నారు. YCP హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని, తాము దీటుగా ఎదుర్కోవడంతో వారి ఆటలు సాగలేదని బాబు అన్నారు.

Similar News

News February 13, 2026

పట్టణాల్లో ‘హ్యాపీ సండే’

image

AP: పట్టణ ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రతి నెలా 2, 4వ ఆదివారాల్లో ఉదయం రెండు గంటలపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. యోగ, ఫిట్‌నెస్ సెషన్లు, క్రీడా పోటీలు, సృజనాత్మక చర్చల అమలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

News February 13, 2026

పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

image

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News February 13, 2026

350 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>సెంట్రల్ <<>>బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై ఎల్లుండే (FEB 15)ఆఖరు తేదీ. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF,CDCS,CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు అర్హులు. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in