News June 5, 2024

APలో ఊహకందని విజయం

image

పసుపు ప్రభంజనానికి YCP తుడిచిపెట్టుకుపోయింది. ఐదేళ్ల కిందట 151 సీట్లతో కనీవినీ ఎరుగని విజయం సాధించిన జగన్ పార్టీని ఈసారి ఆంధ్రా ప్రజలు పక్కన పెట్టేశారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను కూటమి కొల్లగొట్టింది. పెద్దిరెడ్డి తప్ప మంత్రులందరూ ఇంటిదారి పట్టారు. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయిందంటే కూటమి సునామీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Similar News

News November 29, 2024

అమిత్ షా నివాసంలో మహాయుతి నేతల భేటీ

image

మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. ఈ భేటీకి మరో కేంద్రమంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. దాదాపు అర్ధగంటకు పైగా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.

News November 29, 2024

నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

image

1759: ప్రముఖ గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్‌.డి.టాటా మరణం(ఫొటోలో)

News November 29, 2024

RISHABH PANT: ఒకే ఒక్కడు

image

BCCI, IPL కాంట్రాక్టుల ద్వారా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఏటా రూ.30 కోట్లు ఆర్జించబోతున్నారు. IPL ద్వారా రూ.27 కోట్లు, BCCI కాంట్రాక్టు ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తారు. వచ్చే ఏడాది A+ గ్రేడ్‌కు వెళ్తే ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇవే కాక ప్రమోషన్లు, వ్యాపారాలతో పంత్ ఇంకాస్త ఆర్జించనున్నారు. రోహిత్ శర్మ (రూ.23.3 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.28 కోట్లు)కి కూడా ఇంత రాకపోవడం గమనార్హం.