News November 27, 2024
అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్
అదానీపై US డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. మొత్తం 5 అభియోగాల్లో వారిపై మూడే నమోదయ్యాయని తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర, సెక్యూరిటీ ఫ్రాడ్ ఆరోపణలే ఉన్నాయంది.
Similar News
News November 27, 2024
అధికారులు నిద్రపోతున్నారా?: హైకోర్టు ఆగ్రహం
TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.
News November 27, 2024
RGV కోసం పోలీసుల ముమ్మర గాలింపు
సోషల్ మీడియాలో పోస్టుల కేసులో డైరెక్టర్ RGV కోసం AP పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి తెలంగాణ, తమిళనాడు, కేరళలో వెతుకుతున్నారు. కాగా ఆర్జీవీ నిన్న ఓ వీడియో విడుదల చేశారు. తాను భయపడి పారిపోలేదని, సినిమా షూటింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.
News November 27, 2024
కేంద్ర మంత్రితో పవన్ భేటీ.. ఎర్రచందనంపై చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఎర్రచందనం పరిరక్షణపై చర్చించారు. ఏపీ, తమిళనాడులో ఎర్ర చందనం పెరుగుదల, స్వాధీనం చేసుకున్న కలపను ఈ-వేలం వేయడానికి రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కలపను రాష్ట్రానికి తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.