News July 14, 2024
పాపం.. ఒక్కరాత్రి గడిస్తే బతికేవాళ్లు

AP: అనంతపురం(D) హవళిగికి చెందిన భార్యాభర్తలు మారెప్ప, లక్ష్మి కష్టపడి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఇవాళ గృహప్రవేశం పెట్టుకున్నారు. కొత్తింట్లో తమ జీవితం ఆనందంగా ఉంటుందని కలలు కంటూ నిన్న రాత్రి పాత ఇంట్లో నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే వర్షానికి తడిసిన ఇంటి పైకప్పు కూలి వారిపై పడింది. గాఢనిద్రలో ఉన్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పక్కనే నిద్రిస్తున్న వారి కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది.
Similar News
News November 28, 2025
సూర్యాపేట: ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

మోతె మండలం రవికుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి భూక్యా ఉప్పయ్యను సర్పంచ్గా ఎన్నుకున్నాయి. మోతె మండలంలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు ప్రకటించారు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.iimv.ac.in
News November 28, 2025
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో రూ.4.35 కోట్లు వసూలు చేసింది. అటు ఓవర్సీస్లోనూ ఫస్ట్ డే 2,75,000 డాలర్స్ కలెక్ట్ చేసింది. రేపటి నుంచి వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.


