News April 5, 2024

TDP, బీజేపీ, జనసేనది అపవిత్ర పొత్తు: రాఘవులు

image

AP: అరకు ఎంపీ స్థానంలో CPM పోటీ చేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు తెలిపారు. ‘కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా అసెంబ్లీకి సంబంధించిన చర్చల్లో కొన్ని తేడాలున్నాయి. కాంగ్రెస్‌కు గతంలో తక్కువ ఓట్లు వచ్చిన స్థానాలనే అడుగుతున్నాం. TDP, BJP, జనసేనది అపవిత్ర పొత్తు. ఏ మొహం పెట్టుకుని మూడు పార్టీలు కలిశాయి’ అని మండిపడ్డారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- CPM- CPI కలిసి పోటీ చేస్తున్నాయి.

Similar News

News January 31, 2026

టమాటాలు తింటే కలిగే లాభాలు తెలుసా?

image

▶ టమాటాల్లో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
▶ పొటాషియం, లైకోపీన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
▶ BPని అదుపులో ఉంచి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
▶ లైకోపీన్, బీటా-కెరోటిన్ చర్మాన్ని యవ్వనంగా చేస్తాయి.
▶ ఫైబర్, నీరు ఎక్కువగా ఉండడంతో గ్యాస్, ఉబ్బరం సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
▶ విటమిన్ K, కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తాయి.
▶ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి.

News January 31, 2026

అమెరికాలో మళ్లీ షట్‌డౌన్.. డీల్ కుదిరినా తప్పని తిప్పలు!

image

అమెరికా ప్రభుత్వం మళ్లీ పాక్షికంగా మూతపడింది. నిధుల కేటాయింపుపై సెనేట్ చివరి నిమిషంలో డీల్ కుదుర్చుకున్నా.. ప్రతినిధుల సభ సెలవులో ఉండటంతో అర్ధరాత్రి నుంచి పాక్షిక షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందడంతో ఇమిగ్రేషన్ నిధులపై డెమోక్రాట్లు అభ్యంతరం తెలిపారు. సెప్టెంబర్ వరకు నిధులు ఇచ్చేలా ట్రంప్ ఒప్పందం చేసుకున్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయాయి.

News January 31, 2026

Dy.CMగా సునేత్ర.. నాకేం తెలియదన్న శరద్ పవార్!

image

దివంగత నేత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్ MH Dy.CMగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని NCP(SP) అధినేత శరద్ పవార్ అన్నారు. ఆ నిర్ణయంతో తనకు సంబంధం లేదని చెప్పారు. అజిత్ పవార్ ఆశయం మేరకు NCP రెండు వర్గాలు ఏకమవ్వాలని చర్చలు జరిగాయని, కానీ ఆయన అకాల మరణం తీరని లోటని పేర్కొన్నారు. విలీనం ఖాయమనుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.