News August 21, 2024
ఎసెన్షియా కంపెనీ వద్ద కార్మిక సంఘాల ఆందోళన
AP: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. రియాక్టర్ <<13909799>>పేలిన<<>> ఘటనలో మరణించిన వారి మృతదేహాలను తరలిస్తున్న అంబులెన్సులను సంఘాల నేతలు అడ్డుకున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 24, 2025
జీతం ఆలస్యమైతే.. ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?
అనుకోని సందర్భాల్లో జీతం ఆలస్యమైతే ఏం చేస్తారు? చాలామంది ఉద్యోగులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడెలాగూ చాలామందికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అందుకే వచ్చిన జీతంలో ప్రతినెలా కొంత మొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేసుకోవాలి. దీంతో అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉపయోగపడటంతో పాటు అప్పుల్లో కూరుకుపోకుండా చేస్తుంది. మరి మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?
News January 24, 2025
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆ వేలిముద్రలు నిందితుడివే!
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో పట్టుబడిన నిందితుడి, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్రలు ఒకటే అని పోలీసులు నిర్ధారించారు. నటుడి ఇంటి వద్ద CC ఫుటేజీలో కనిపించిన వ్యక్తి తన కుమారుడు కాదని నిందితుడి తండ్రి వారించారు. దీంతో సైఫ్ ఇంట్లోకి వెళ్లేందుకు నిందితుడు ఎక్కిన పైప్, తలుపులపై ఉన్న వేలిముద్రలను పరిశీలించారు. సైఫ్ 2వ కుమారుడి గదిలో దొరికిన క్యాప్‌కు ఉన్న వెంట్రుకను సైతం పోలీసులు DNA టెస్టుకు పంపారు.
News January 24, 2025
మీ పిల్లలు ఎంతసేపు నిద్ర పోతున్నారు?
పోషకాహారంతో పాటు సరైన నిద్ర పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 6-12 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు కనీసం 9గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోతే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారని చెబుతున్నారు. వీళ్లు సరైన నిర్ణయాలు తీసుకోలేరని, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నిద్ర సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.