News April 24, 2025
కేంద్ర హోంశాఖ, IB, RAW ఎమర్జెన్సీ మీటింగ్

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దీనికి హోంశాఖ కార్యదర్శి, IB డైరెక్టర్, RAW చీఫ్ తదితరులు హాజరయ్యారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News August 16, 2025
యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు: ట్రంప్

అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం విజయవంతంగా సాగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించే దిశగా చర్చలు సాగాయన్నారు. ఇదే విషయమై జెలెన్ స్కీ, ఈయూ నేతలు, నాటో జనరల్ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఎల్లుండి జెలెన్‌స్కీ అమెరికాకు వస్తారని, అన్ని సక్రమంగా జరిగితే పుతిన్‌తో మరోసారి సమావేశం అవుతామన్నారు.
News August 16, 2025
పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్స్: ఈసీ

ఎలక్టోరల్ రోల్స్‌పై పలు పార్టీలు అనుమానాలు లేవనెత్తడంపై ECI ప్రకటన జారీ చేసింది. ఎలక్టోరల్ రోల్స్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని, వీటి ప్రిపరేషన్లో ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయంది. తప్పులు గుర్తించేందుకు తగిన సమయం ఉంటుందని పేర్కొంది. సరైన సమయంలో సమస్యలు లేవనెత్తితే పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపింది. చట్ట ప్రకారం, పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్ సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది.
News August 16, 2025
పిల్లల్ని కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ!

కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తోంది. సింగపూర్ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డా.జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ‘ప్రెగ్నెన్సీ రోబో’ను పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌ను ప్రవేశపెట్టి, ట్యూబ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తారు. 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు.