News August 1, 2024
బీజేపీపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైర్

కర్ణాటకలో BJP, JDS మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్‌లపై కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా BJP చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి. దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన హసన్ మాజీ MLA ప్రీతంతో మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. BJP తీరు బాధపెట్టిందన్నారు. ప్రజ్వల్ సెక్స్ టేప్‌లను వైరల్ చేయడంలో ప్రీతం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి.
Similar News
News December 28, 2025
పసిపిల్లలకు ఫుడ్ అలవాటు చేసేముందు

ఘనాహారం అలవాటు చేసే ముందు పిల్లలకు పెట్టే ఏ ఆహారమైనా వారి శరీరానికి సరిపడుతుందో, లేదో ఒక్కసారి పరిశీలించాలంటున్నారు నిపుణులు. ముందుగా కొద్ది మొత్తాల్లో వారికి పెట్టి చూడాలి. దీంతో అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వారికి పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత నిపుణుల సలహా తీసుకొని వారిచ్చిన న్యూట్రిషన్ ఛార్ట్ ఫాలో అయితే మీ చిన్నారికి చక్కటి పోషకాహారం అందుతుందంటున్నారు.
News December 28, 2025
పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?

ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి దిష్టి తీస్తారు. ఉప్పును ఎడమ చేత్తో తీసుకుని బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దీంతో ఉప్పు బిడ్డలోని ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్మకం. అలాగే బిడ్డపై ఉన్న చెడు ప్రభావం పోతుందని అంటారు. అనంతరం ఆ ఉప్పును ఎవరూ తొక్కని చోట పారవేయాలి. ఈ ప్రక్రియ బిడ్డకు దృష్టిని మళ్లించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మార్గమని మరికొందరు అంటారు.
News December 28, 2025
భారత్‌కు హాదీ హంతకులు.. ఖండించిన BSF

బంగ్లాదేశ్ యువనేత హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లోకి ప్రవేశించారన్న <<18694542>>ప్రచారాన్ని<<>> మేఘాలయ పోలీసులు, BSF ఖండించాయి. కాగా నిందితులు భారత్‌లోకి వచ్చి తురా సిటీకి చేరుకున్నారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే దీనిపై భారత్‌కు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదన్నారు. అదే విధంగా స్థానికులు, టాక్సీ డ్రైవర్ పాత్రపై కూడా ఆధారాల్లేవన్నారు. అయినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.


