News April 9, 2025
కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి హత్య

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ హత్యకు గురయ్యారు. బిహార్లోని గయాలో భర్త రమేశ్ నాటు తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి ఇంకా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.

ఇవాళ భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.