News November 21, 2024
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు పితృవియోగం

AP: నరసాపురం బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు (91) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఇవాళ మరణించారు. రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. సూర్యనారాయణ రాజు మృతి పట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, ముఖ్య నాయకులు సంతాపం తెలిపారు.
Similar News
News October 31, 2025
సత్య మూవీపై జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

సత్య(1998) మూవీ గురించి JD చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో తన క్యారెక్టర్‌ను చంపేయడం పెద్ద మిస్టేక్ అని డైరెక్టర్ వర్మ చెప్పినట్లు తెలిపారు. ‘ముగింపు ఇంకోలా ఉంటే బాగుండేదని RGV ఇటీవల అభిప్రాయపడ్డారు. కానీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఆ సినిమా ఎండింగ్‌ను మారుస్తానంటే ఇప్పుడు ఎవరూ ఒప్పుకోరని అన్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన కెరీర్‌లో సత్య టర్నింగ్ పాయింట్‌గా మారిందని JD చెప్పారు.
News October 31, 2025
వెనిజులాపై దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

వెనిజులాలోని మిలిటరీ స్థావరాలపై దాడులకు అమెరికా సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోల్స్ డ్రగ్ ముఠా ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పింది. కొన్ని రోజులు లేదా కొన్నిగంటల్లో అటాక్స్ జరగొచ్చని తెలిపింది. ఆ దేశాధ్యక్షుడు మదురో నేతృత్వంలోనే ఈ డ్రగ్ ముఠా నడుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఏటా 500 టన్నుల కొకైన్‌ను యూరప్, అమెరికన్ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతోంది.
News October 31, 2025
‘పహల్గామ్’ టెర్రరిస్టుల ఏరివేత.. 40 మందికి పురస్కారాలు

దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తు, ప్రత్యేక ఆపరేషన్లలో ప్రతిభ కనబర్చిన 1,466మంది ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత(ఆపరేషన్ మహాదేవ్)లో పాల్గొన్న 40మంది J&K పోలీసులు, CRPF సిబ్బంది ఉన్నారు. హోంశాఖ పరిధిలోని పురస్కారాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన కేంద్రం.. ఏటా ‘సర్దార్’ జయంతి రోజు(OCT31) దక్షతా పదక్ అవార్డులను ప్రకటిస్తోంది.


