News March 12, 2025
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్దేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి మంత్రి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు శ్రీనివాస వర్మ వాహనాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి తల, కాలుకు గాయాలయ్యాయి. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Similar News
News March 28, 2026
కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.
News March 28, 2026
వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. నేడు అసెంబ్లీలో బిల్లు

TG: ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, Dy.CM భట్టి 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
News March 28, 2026
గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?

శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


