News December 1, 2024

కేంద్రమంత్రిపై తేనెటీగల దాడి.. రక్షించిన సిబ్బంది

image

మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల దాడి జరిగింది. శివపురి జిల్లాలోని మాధవ్ నేషనల్ పార్కులో ఓ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఆయన వెళ్లారు. ఈలోపే ఒక్కసారిగా తేనెటీగలు వచ్చిపడటంతో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది కర్చీఫ్‌లు, టవల్స్‌తో ఆయనకు రక్షణ కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.

Similar News

News January 27, 2026

APPLY NOW: NITCలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌ (<>NITC<<>>) 9 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11వరకు దరఖాస్తును rectnf@nitc.ac.in ఈ మెయిల్‌కు సెండ్ చేయాలి. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ), BTech/PGDM/MBA, MCA, BSc(CS, IT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nitc.ac.in/

News January 27, 2026

ఎవరు ఎంత ఫైబర్ తీసుకోవాలంటే?

image

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రకారం, వయస్సును బట్టి మనం తీసుకునే ఫైబర్‌ పరిమాణం మారుతుండాలి. పెద్దలు రోజువారీ ఆహారంలో సుమారు 30 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. 15 ఏళ్లలోపు పిల్లలకు 20 గ్రాములు, మూడేళ్లలోపు వారికి15 గ్రాముల ఫైబర్‌ సరి పోతుంది. ఒకేసారి కాకుండా ఆహారంలో ఫైబర్‌ పరిమాణాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 27, 2026

లింగం రూపంలో నరసింహస్వామి.. ఎక్కడంటే?

image

మహబూబ్ నగర్(D) కొల్లాపూర్‌ సమీపంలోని సింగోటంలో నరసింహస్వామి ‘లింగ’ రూపంలో దర్శనమిస్తారు. సింగమనాయుడి కాలంలో ఓ రైతు పొలం దున్నుతుండగా ఈ శిల లభించింది. స్వామి కలలో కనిపించి చెప్పడంతో దీనిని ప్రతిష్టించారు. ఇక్కడ స్వామికి నిలువు, అడ్డ నామాలుంటాయి. ఇది హరిహర అద్వైతానికి ప్రతీక. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. సంక్రాంతి తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలు, జాతర నిర్వహిస్తారు.