News December 23, 2024

సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం: విజయశాంతి

image

TG: సంధ్య థియేటర్ ఘటనపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ‘ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట ఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేలా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 23, 2024

మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా?: ట్రంప్ ఆన్సర్ ఇదే

image

US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించనున్న స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారా? అన్న ప్రశ్నకు ‘అది సాధ్యం కాదు. నేను సేఫ్. ఎందుకంటే మస్క్ USలో జన్మించలేదు’ అని సమాధానమిచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ పుట్టినవారికే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కాగా మస్క్ సౌతాఫ్రికాలో జన్మించారు.

News December 23, 2024

శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

News December 23, 2024

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు: మంత్రి

image

TG: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన <<14952214>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.