News February 21, 2025
మిర్చిపంటపై ముగిసిన కేంద్ర మంత్రుల భేటీ

AP: మిర్చి పంటకు రూ.11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్‌ని కోరామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతి అంశాన్నీ చర్చించామన్నారు. సానుకూలంగా స్పందించిన వ్యవసాయ మంత్రి ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు. ప్రభుత్వం మిర్చి రైతులకు ప్రయోజనం కలిగేలా అన్నివిధాలా కృషి చేస్తుందని రామ్మోహన్ హామీ ఇచ్చారు.
Similar News
News January 17, 2026
ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.
News January 17, 2026
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 17, 2026
రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: KTR

TG: సీఎం రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని KTR విమర్శించారు. ‘సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. SEC కార్పొరేషన్ సాధనకు ర్యాలీ నిర్వహించాలనుకుంటే మా నేతలను నిర్బంధించారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ర్యాలీ చేస్తాం. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం’ అని అన్నారు. అటు SECకు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరి పరిధిలో కలపడం అన్యాయమని BRS ఆరోపిస్తోంది.


