News February 21, 2025
మిర్చిధరలపై కేంద్రమంత్రి సమావేశం

AP: మిర్చి పంటకు కనీస మద్దతు ధరపై వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ నేతృత్వంలో నేడు భేటీ జరగనుంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా పంట మద్దతు ధరపై సంబంధిత వర్గాలతో చర్చించనున్నట్లు సమాచారం. ధరల పతనంపై సమీక్షతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యను కేంద్రమంత్రికి వివరించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 16, 2025
RNSBలో ఉద్యోగాలు

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్సైట్: https://rnsbindia.com/
News October 16, 2025
బిగ్‌బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్‌బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
News October 16, 2025
ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్‌ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.